శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. కిష్త్వార్ జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు టెర్రరిస్టులు హతమైనట్లు అధికారులు వెల్లడించారు. ఆదివారం (ఫిబ్రవరి 22) కిష్త్వార్ జిల్లాలోని మారుమూల ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కిఉన్నారన్న జమ్మూ కాశ్మీర్, ఇంటెలిజెన్స్ బ్యూరో విశ్వసనీయ సమాచారం మేరకు భద్రతా దళాలు ఆపరేషన్ ట్రాషి-I పేరుతో కూంబింగ్ చేపట్టాయి.
ఈ క్రమంలో భద్రతా దళాలను చూసిన టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన జవాన్లు కౌంటర్ ఎటాక్ చేశారు. భద్రతా దళాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు అధికారులు తెలిపారు. ఘటన స్థలంలో ఆపరేషన్ కొనసాగుతోందని పేర్కొన్నారు. చనిపోయిన ఉగ్రవాదులకు నిషేధిత జైషే మహ్మద్ టెర్రర్ గూప్ తో సంబంధాలు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు.
